Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:06 PM

బట్టపోతు రాములు సేవలు చిరస్మరణీయం

బట్టపోతు రాములు సేవలు చిరస్మరణీయం

బట్టపోతు రాములు సేవలు చిరస్మరణీయం
31-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దామెర వాటర్ ప్లాంట్‌కు మరమ్మతులు, 200 వాటర్ క్యాన్ల పంపిణీ

వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సామాజిక సేవలు అభినందనీయం: సర్పంచ్ శ్రీధర్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కీర్తిశేషులు బట్టపోతు రాములు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని దామెర సర్పంచ్ సాతిరి శ్రీధర్ కొనియాడారు. బట్టపోతు రాములు 6వ వర్ధంతిని పురస్కరించుకుని మండల పరిధిలోని దామెర గ్రామంలోని వాటర్ ప్లాంట్‌కు వారి కుటుంబ సభ్యులు సొంత ఖర్చులతో మరమ్మత్తులు చేయించి, గ్రామానికి 200 వాటర్ క్యాన్లను ఉచితంగా అందజేశారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీధర్ మాట్లాడుతూ.. రాములు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు నిరంతరం ప్రజాసేవలో నిలుస్తున్నారని తెలిపారు. గతంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి 50,000 ఆర్థిక సాయం అందించడమే కాకుండా, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, వృద్ధులకు చేతి కర్రలు పంపిణీ చేశారని గుర్తుచేశారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఉప్పునూతల నరసింహ, రాములు కుటుంబ సభ్యులు బట్టపోతు కరుణ, విజయ్, విక్రమ్, వరుణ్, బట్టపోతు బిక్షం, సరిపల్లి మంజుల, పెరుమాళ్ళ అరవింద్, ఐతగోని నరసింహ, సాతిరి మధు, ఊడగు యాదయ్య, సాతిరి ధనరాజు, బట్టపోతు సత్తయ్య, ఊడగు రాఘవేంద్ర, ఏన్నం శ్రీనివాస్, బియ్య సత్యనారాయణ, సాతిరి రాజు, సాతిరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బట్టపోతు రాములు సేవలు చిరస్మరణీయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News