బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం
హైదరాబాద్: తెలంగాణలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును అమలు చేయాలని కోరుతూ బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
శంషాబాద్–నల్గొండ–సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని ఏర్పాటు చేయడంతో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం తదితర ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని కమిటీ ప్రతినిధులు వివరించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టు సాధనకు సహకరించాలని మహేశ్వర్‌రెడ్డిని కోరారు. బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కమిటీ ప్రతినిధులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి