ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
సూర్యాపేటటౌన్ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తోందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డలో శ్రీశ్రీశ్రీ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ అమ్మవారి బోనాల పండుగలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న తెలంగాణ సంస్కృతికి బోనాల పండుగ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని తెలిపారు. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలవడం తెలంగాణ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనదని పేర్కొన్నారు.
ముత్యాలమ్మ అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు. సూర్యాపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలంతా బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సర్వోత్తమ్‌రెడ్డి కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి