Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్లూ జాయ్ చైర్మన్ వీరబాబును అభినందించి సన్మానించిన హ్యూమన్ రైట్స్ డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 07:54 PM

పంతంగిలో దారుణం: పథకం ప్రకారమే హతమార్చారా?

23-08-2026 217 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఘటనా స్థలానికి చేరుకున్న ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్

రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతంగి గ్రామం చనగలగుట్ట వద్ద ఆదివారం ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం... అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య (36, తండ్రి: లేట్ వెంకయ్య, కులం: వడ్డెర, వృత్తి: వ్యవసాయం) చనగలగుట్ట సమీపంలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న వెంటనే చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ​హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు వెంటనే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. వారు ఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించడంతో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

Sthanikam

పంతంగిలో దారుణం: పథకం ప్రకారమే హతమార్చారా?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News