Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

ఆర్థిక స్వావలంబనకు పొదుపే తొలి అడుగు:మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం

Updated : 23 Aug 2026 17:03 IST
As Preferred Source 1 min read
ఆర్థిక స్వావలంబనకు పొదుపే తొలి అడుగు:మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో దుదంగోడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన స్వయం సహాయక సంఘాల శిక్షణ కార్యక్రమంలో పాలమూరు మండల సమాఖ్య సీఆర్పీ ట్రైనర్ స్వప్న ,జమ్బేశ్వర్ మాట్లాడుతూ.. మహిళలు పొదుపు అలవాటును పెంపొందించుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. సంఘాల నిర్వహణ, బ్యాంకు రుణాలను సక్రమంగా వినియోగించుకోవడం, రుణాల ద్వారా ఆదాయం పెంచే జీవనోపాధి అవకాశాలను ఎంచుకోవడం వంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు.మహిళా సంఘాలు పేదరిక నిర్మూలనతో పాటు కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. ప్రతి మహిళ క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ, అందుబాటులో ఉన్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని దివ్య మంగమ్మ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీసీ హడమండ్లు,వీఓఏ కవిత, గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాలు సాయమ్మ, గ్రామ మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్థిక స్వావలంబనకు పొదుపే తొలి అడుగు:మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో దుదంగోడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన స్వయం సహాయక సంఘాల శిక్షణ కార్యక్రమంలో పాలమూరు మండల సమాఖ్య సీఆర్పీ ట్రైనర్ స్వప్న ,జమ్బేశ్వర్ మాట్లాడుతూ.. మహిళలు పొదుపు అలవాటును పెంపొందించుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. సంఘాల నిర్వహణ, బ్యాంకు రుణాలను సక్రమంగా వినియోగించుకోవడం, రుణాల ద్వారా ఆదాయం పెంచే జీవనోపాధి అవకాశాలను ఎంచుకోవడం వంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు.మహిళా సంఘాలు పేదరిక నిర్మూలనతో పాటు కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. ప్రతి మహిళ క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ, అందుబాటులో ఉన్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని దివ్య మంగమ్మ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీసీ హడమండ్లు,వీఓఏ కవిత, గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాలు సాయమ్మ, గ్రామ మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news