Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

కంగ్టిలో బైపాస్ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి:

11-08-2026 210 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఏళ్లుగా హామీలకే పరిమితమైన బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి హెచ్. దాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంగ్టి మండల కేంద్రం కావడంతో ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది వాహనాలు ప్రధాన రహదారి గుండా రాకపోకలు సాగిస్తున్నాయని, దీంతో పట్టణంలో వాహనాల రద్దీ పెరిగి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రధాన రహదారి కూడా అధ్వానంగా మారి అనేక చోట్ల గుంతలు ఏర్పడ్డాయని, వర్షాకాలంలో రోడ్డుపైనే వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కంగ్టిలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడతామని ఎన్నో ఏళ్లుగా హామీలు ఇస్తున్నప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే పట్టణంలోని ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, సులభమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజల చిరకాల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇకనైనా తక్షణమే స్పందించి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టి, పనులను ప్రారంభించాలని హెచ్. దాస్ కోరారు.

Sthanikam

కంగ్టిలో బైపాస్ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి:

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News