జర్నలిస్టుకు రూ.15 వేల ఆర్థిక సాయం
ఆపదలో ఉన్న బాల్య మిత్రుడికి అండగా నిలిచి స్నేహబంధాన్ని చాటుకున్నారు జిల్లా ప్రభుత్వ బాలుర పాఠశాల 2003–04 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు. రోడ్డు ప్రమాదానికి గురై విశ్రాంతి తీసుకుంటున్న సూర్యాపేట మండలం కేసారం గ్రామానికి చెందిన జర్నలిస్టు చింత సతీష్‌ను మంగళవారం ఇందిరమ్మ కాలనీలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.15 వేల ఆర్థిక సాయం అందజేశారు. సతీష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మిత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న తమ మిత్రుడికి అండగా నిలవడం బాధ్యతగా భావించామని తెలిపారు. కార్యక్రమంలో వినయ్, లక్ష్మీనర్సు, ప్రవీణ్, రంగయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి