Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్.. ఎంపీ పట్టుదల రైల్వే మంత్రికి వినతిపత్రం.. అసలు ప్రతిపాదిత రూట్ కొనసాగింపునకు డిమాండ్

Updated : 11 Aug 2026 19:48 IST
As Preferred Source 1 min read
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్.. ఎంపీ పట్టుదల రైల్వే మంత్రికి వినతిపత్రం.. అసలు ప్రతిపాదిత రూట్ కొనసాగింపునకు డిమాండ్

హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్‌ను మొదట ప్రతిపాదించిన సంగారెడ్డి–జహీరాబాద్–షోలాపూర్ మార్గంలోనే కొనసాగించాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని తాండూర్, వికారాబాద్ మీదుగా మళ్లించే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు వస్తున్న నేపథ్యంలో జహీరాబాద్ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మొదట రూపొందించిన ప్రాజెక్టు నివేదిక ప్రకారం జహీరాబాద్ మీదుగానే రూట్‌ను కొనసాగించాలని కోరారు. జహీరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి బుల్లెట్ ట్రైన్ అనుసంధానం ఎంతో కీలకమని, దీనివల్ల పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అలాగే ప్రతిపాదిత అసలు మార్గం నిర్మాణ వ్యయం, భౌగోళిక పరిస్థితుల పరంగా అనుకూలంగా ఉందని వివరించారు. జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ రాకపోతే ఈ ప్రాంత అభివృద్ధికి నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంటూ, ప్రాంతీయ సమతుల్య అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మొదట ప్రతిపాదించిన సంగారెడ్డి–జహీరాబాద్–షోలాపూర్ మార్గాన్నే యథాతథంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రిని ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కోరారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news