Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

వెంపటి ప్రాథమిక పాఠశాలకు డ్రమ్ములు అందజేసిన ;మాజీ ఉపసర్పంచ్ భాషబోయిన వెంకన్న

11-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;తాను చిన్ననాటి ఓనమాలు నేర్చుకున్న పాఠశాలపై ఉన్న మమకారాన్ని చాటుకుంటూ వెంపటి గ్రామ మాజీ ఉపసర్పంచ్ భాషబోయిన వెంకన్న సేవా కార్యక్రమం చేపట్టారు. తన తల్లిదండ్రులు భాషబోయిన అంజయ్య, ఉప్పలమ్మల జ్ఞాపకార్థం వెంపటి ప్రాథమిక పాఠశాలకు డ్రమ్ములను అందజేశారు. గ్రామస్తుల చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బివనపల్లి శ్రీనివాస్‌కు వాటిని అందించారు వెంకన్న ఇదే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకుని అనంతరం ప్రజాజీవితంలోకి ప్రవేశించి గ్రామ మాజీ ఉపసర్పంచ్‌గా సేవలందించారు. తన ఎదుగుదలకు పునాది వేసిన పాఠశాలను, విద్యాబోధన అందించిన ఉపాధ్యాయులను మరువకుండా పాఠశాల అవసరాలకు సహకారం అందించడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.పాఠశాలలో జరిగే ప్రార్థనా కార్యక్రమాలు, జాతీయ పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యా కార్యక్రమాల్లో డ్రమ్ములు విద్యార్థులకు ఉపయోగపడనున్నాయి.తల్లిదండ్రుల జ్ఞాపకాలను విద్యార్థులకు ఉపయోగపడే సేవా కార్యక్రమంగా మలచడం ఆదర్శనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా భాషబోయిన వెంకన్న మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలకు తిరిగి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ఈ సహాయం అందించినట్లు తెలిపారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను అందించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.తాను చదువుకున్న బడికి తిరిగి సేవ చేయడం ప్రతి పూర్వ విద్యార్థికి గర్వకారణమని గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పేర్కొన్నారు.పాఠశాలల అవసరాలను గుర్తించి పూర్వ విద్యార్థులు మరింత మంది ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దాసరి మంజుల రామచంద్రు, వార్డు సభ్యుడు పులిగుజ్జ నరసయ్య, మాజీ సర్పంచ్ అబ్బగాని సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మాదరబోయిన రవి, కాంగ్రెస్ నాయకులు సూదగాని రాజయ్య, సగ్గం నరసయ్య, చంటి వెంకన్న, బోళ్ల నరసయ్య, చిర్ర దిలీప్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెంపటి ప్రాథమిక పాఠశాలకు డ్రమ్ములు అందజేసిన ;మాజీ ఉపసర్పంచ్ భాషబోయిన వెంకన్న

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News