Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

ఈవో ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారు: సర్పంచ్‌ నిరంజన్‌ గౌడ్‌

02-08-2026 256 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దండు మల్కాపురం మైసమ్మ ఆలయంలో ప్రోటోకాల్‌ ఉల్లంఘన

మండల పరిధిలోని దండు మల్కాపురం శ్రీ ఆందోల్‌ మైసమ్మ దేవస్థానం ఈవో వ్యవహార శైలిపై స్థానిక సర్పంచ్‌ గిర్కటి నిరంజన్‌ గౌడ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలకు ఏజెంట్‌లా వ్యవహరిస్తూ ఆలయ ప్రోటోకాల్‌ను పక్కనబెట్టారని మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆలయంలో జరిగిన బోనాల మహోత్సవాల్లో ప్రోటోకాల్‌ ప్రకారం స్థానిక సర్పంచ్‌నైన తనను ఆహ్వానించకపోగా, కనీసం ఆహ్వాన పత్రికలోనూ పేరు వేయకుండా తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అధికారి పార్టీ నేతల ప్రాపకం కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. గ్రామ ప్రథమ పౌరుడిని విస్మరించి ఇతరులను ముఖ్య అతిథులుగా ఏ ప్రామాణికాలతో పిలిచారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజాస్వామ్య మర్యాదలను కాలరాసిన ఈవో తీరుపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రోటోకాల్‌ అమలయ్యేలా చూడాలని డిమాండ్‌ చేశారు.

Sthanikam

ఈవో ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారు: సర్పంచ్‌ నిరంజన్‌ గౌడ్‌

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News