Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

ఆగస్టు 10న ‘జైల్‌ భరో’ను జయప్రదం చేయండి​- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం

02-08-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త ‘జైల్‌ భరో’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. చౌటుప్పల్‌లోని కందాల రంగారెడ్డి భవనంలో ఎండీ పాషా అధ్యక్షతన ఆదివారం సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ​ఈ సమావేశంలో నాయకులు బూరుగు కృష్ణారెడ్డి, గంగదేవి సైదులు, మల్లేశం మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్‌ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచడం, 'హైర్ & ఫైర్' విధానాలను ఉపసంహరించుకోవాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధర ఇవ్వాలని, సమగ్ర రుణవిమోచన చట్టం చేయాలని కోరారు. ​ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, విద్యుత్‌ సవరణ బిల్లు-2025ను రద్దు చేసి ఉచిత విద్యుత్‌ను కాపాడాలని స్పష్టం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మికులు, రైతులు ఏకమై ఆగస్టు 10న జరిగే ఆందోళనల్లో వేలాదిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షులు గోశిక కరుణాకర్, ప్రజా సంఘాల నాయకులు చీరిక సంజీవరెడ్డి, ఆకుల ధర్మయ్య, బొడ్డు అంజిరెడ్డి, చింతల సుదర్శన్, చిమకండ్ల శ్రీరాములు, బత్తుల దాసు , కాలకుంట్ల శివ, జొన్నగంటి దేవయ్య, యాట బాలరాజు, రాపోలు పద్మ, చెరుకు లక్ష్మమ్మ, శ్రీనివాస్ రెడ్డి, యాట ముత్యాలు, పబ్బతి పుల్లయ్య, తోర్పు నూరి మల్లేశం, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య, ఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆగస్టు 10న ‘జైల్‌ భరో’ను జయప్రదం చేయండి​- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News