Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:03 PM

బస్సు ఎక్కుతున్న వారే టార్గెట్‌..! ముగ్గురు జేబుదొంగలు అరెస్ట్ ఐఫోన్‌, మోటరోలా సెల్‌ఫోన్లు స్వాధీనం.. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలింపు.

01-08-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగోల్: బస్సులు ఎక్కే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని సెల్‌ఫోన్లు అపహరిస్తున్న ముగ్గురు అలవాటు నేరస్తులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక ఐఫోన్‌, ఒక మోటరోలా సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం.. జూలై 31న నాగోల్ చౌరస్తాలోని బస్‌స్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్న నారాయణ రాజ్‌కుమార్‌, వెంకటాచారి బస్సు ఎక్కుతున్న సమయంలో కావడి శివ (22) వారిని మాటల్లో పెట్టి దృష్టి మరల్చాడు. అదే సమయంలో అతనితో పాటు ఉన్న మేకల జగపతి బాబు అలియాస్ జగపతి, బోయ అలియాస్ గారడీ మంజునాథ్ అలియాస్ మంజు వారి జేబుల్లోని రెండు సెల్‌ఫోన్లను అపహరించి పరారయ్యారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 1న నాగోల్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి దొంగిలించిన ఐఫోన్‌, మోటరోలా సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో ప్రధాన నిందితుడు మేకల జగపతి బాబుపై వివిధ పోలీస్‌స్టేషన్లలో ఏడు సెల్‌ఫోన్ చోరీ కేసులు, బోయ అలియాస్ గారడీ మంజునాథ్‌పై నాలుగు చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు నాగోల్ పోలీసులు తెలిపారు.

Sthanikam

బస్సు ఎక్కుతున్న వారే టార్గెట్‌..! ముగ్గురు జేబుదొంగలు అరెస్ట్ ఐఫోన్‌, మోటరోలా సెల్‌ఫోన్లు స్వాధీనం.. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలింపు.

Article Image

నాగోల్: బస్సులు ఎక్కే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని సెల్‌ఫోన్లు అపహరిస్తున్న ముగ్గురు అలవాటు నేరస్తులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక ఐఫోన్‌, ఒక మోటరోలా సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం.. జూలై 31న నాగోల్ చౌరస్తాలోని బస్‌స్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్న నారాయణ రాజ్‌కుమార్‌, వెంకటాచారి బస్సు ఎక్కుతున్న సమయంలో కావడి శివ (22) వారిని మాటల్లో పెట్టి దృష్టి మరల్చాడు. అదే సమయంలో అతనితో పాటు ఉన్న మేకల జగపతి బాబు అలియాస్ జగపతి, బోయ అలియాస్ గారడీ మంజునాథ్ అలియాస్ మంజు వారి జేబుల్లోని రెండు సెల్‌ఫోన్లను అపహరించి పరారయ్యారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 1న నాగోల్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి దొంగిలించిన ఐఫోన్‌, మోటరోలా సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో ప్రధాన నిందితుడు మేకల జగపతి బాబుపై వివిధ పోలీస్‌స్టేషన్లలో ఏడు సెల్‌ఫోన్ చోరీ కేసులు, బోయ అలియాస్ గారడీ మంజునాథ్‌పై నాలుగు చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు నాగోల్ పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News