45,272 మంది ఓటర్ల పరిశీలన ముగింపు..
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రక్రియ పూర్తి.
రామన్నపేట, స్థానిక ప్రతినిధి:
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–SIR) కార్యక్రమంలో రామన్నపేట మండలం 100 శాతం పురోగతి సాధించింది. మండలంలోని మొత్తం 45,272 మంది ఓటర్ల వివరాల పరిశీలనను జూలై 30 నాటికి పూర్తిచేసినట్లు తహసీల్దార్ లాల్ బహుదూర్ తెలిపారు.
మండలంలోని 24 గ్రామపంచాయతీల్లో బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రక్రియలో మృతి చెందినవారు, 1,098 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు. నివాసం మార్చుకున్న (షిఫ్ట్) వారు, 1,848 మంది,
డబుల్ నమోదులు 425 మంది ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.మొత్తం 3,371 కేసులను పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టినట్లు వెల్లడించారు.ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు అర్హుల పేర్లను నమోదు చేయడం, అనర్హుల పేర్లను తొలగించడం వంటి ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి మండలంలో ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతంగా పూర్తిచేసినట్లు తహసీల్దార్ తెలిపారు.అయితే ప్రస్తుతం 968 మ్యాపింగ్ కాని కేసులు నోటీసులో ఉన్నాయని వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి