Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:14 PM

సన్మాన సభలో సర్పంచ్ పద్మావతి.. గ్రామాభివృద్ధికి అందరి సహకారం కోరారు

01-08-2026 195 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని డేగుల్ వాడి గ్రామంలో శనివారం యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ పద్మావతి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పద్మావతి మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి పనులను వేగంగా చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే గ్రామంలో మూడు బీటీ రోడ్ల నిర్మాణం, వాటర్ గుమ్మీల ఏర్పాటు, హైమాస్ట్, హాలోజన్ విద్యుత్ దీపాల ఏర్పాటు, రెండు డ్రైనేజీల నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని, వాటిని కూడా త్వరలో పూర్తి చేసేందుకు గ్రామంలోని అన్ని సంఘాలు, ప్రతిపక్ష నాయకులు, యువత, మహిళలు, గ్రామ పెద్దలు, ప్రజలందరూ సహకరించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, అందరి సహకారంతో దేగులవాడిని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

సన్మాన సభలో సర్పంచ్ పద్మావతి.. గ్రామాభివృద్ధికి అందరి సహకారం కోరారు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News