చదువుకు పేదరికం అడ్డంకి కాదని కంగ్టి మండల కేంద్రానికి చెందిన సుతే ఎలియన్ నిరూపించాడు. ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదురైనా పట్టుదలతో చదివి నీట్‌లో మంచి ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటు పొందాడు. ఇటీవల జరిగిన కౌన్సెలింగ్‌లో రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు లభించింది. చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలనే లక్ష్యంతో చదువుకున్న ఎలియన్ పదో తరగతి వరకు సిద్దిపేట గురుకుల పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ను వరంగల్ గురుకుల కళాశాలలో పూర్తి చేశాడు.ఎలియన్ తండ్రి లక్ష్మణ్ కంగ్టి అంబేద్కర్ చౌరస్తాలో పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నలుగురు కుమార్తెలను చదివించి, వారి వివాహాలు జరిపించడంతో పాటు కుటుంబ బాధ్యతలు, అప్పులు ఉన్నప్పటికీ కుమారుడి చదువుకు అండగా నిలిచారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఎలియన్ వైద్య విద్యలో సీటు సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. అయితే ఎంబీబీఎస్ చదువును పూర్తిచేయడానికి అయ్యే ఖర్చును భరించడం కుటుంబానికి భారంగా మారింది. తన కుమారుడిని డాక్టర్‌గా చూడాలన్నదే తన కోరిక అని తండ్రి లక్ష్మణ్ తెలిపారు. పేదలకు వైద్య సేవలు అందించాలన్నదే తన లక్ష్యమని, దాతలు, సేవా సంస్థలు ఆర్థికంగా సహకరిస్తే వైద్య విద్యను పూర్తిచేసి భవిష్యత్తులో ప్రజలకు సేవ చేస్తానని ఎలియన్ తెలిపాడు.
పండ్ల వ్యాపారి కుటుంబంలో వెలిగిన చదువుల దీపం.. డాక్టర్ కాబోతున్న ఎలియన్

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి