భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాల సమర్పణ
చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలో ఆదివారం బోనాల పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా స్థానిక అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల నడుమ నెత్తిన బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. పండుగ వాతావరణంతో గ్రామం సందడిగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి