తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని 11వ వార్డులో హైస్కూల్ ఎదురుగా అప్పారావు ఇంటి సమీపంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు నిర్మిస్తున్న గద్దెపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కనే, అదీ మలుపు వద్ద గద్దె నిర్మిస్తుండటంతో భవిష్యత్‌లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు. ఈ మార్గం మీదుగా ప్రతిరోజూ పాఠశాల బస్సులు, ట్రాక్టర్లు, ప్రయాణికుల ఆటోలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మలుపు వద్ద రోడ్డుకు అతి సమీపంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటంతోపాటు ప్రమాదాల ముప్పు ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టే ముందు సంబంధిత ప్రాంత ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ గద్దెను ప్రస్తుత ప్రాంతంలో కాకుండా రోడ్డుకు, మలుపుకు కొంత దూరంలో నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వెంటనే పనులు నిలిపివేయాలి
మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ప్రస్తుత నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, ప్రజలకు మరియు వాహనదారులకు ఇబ్బంది కలగని సురక్షిత ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే అధికారులు స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి