వ్యక్తి సజీవ దహనం? మృతదేహం గుర్తించలేని విధంగా కారు దగ్ధం
సూర్యాపేట రూరల్: ఖమ్మం–హైదరాబాద్ 365బీ జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమై బూడిదగా మారింది.ప్రమాద సమయంలో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు ప్రాథమికంగా సమాచారం. అయితే కారులో ఒక్కరే ఉన్నారా? మరెవరైనా ఉన్నారా? అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కారు పూర్తిగా కాలిపోవడంతో లోపల ఉన్న వ్యక్తుల సంఖ్యను గుర్తించడం కష్టంగా మారింది.
సమాచారం అందుకున్న సూర్యాపేట రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రూరల్ ఎస్సై అనిల్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు, కారులో ఎంతమంది ప్రయాణించారు తదితర విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి