గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కంగ్టి గ్రామంలో యోగి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చెస్ టోర్నమెంట్ సీజన్-2’ ఘనంగా ముగిసింది. భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో చెస్ పోటీలను నిర్వహించడం పట్ల గ్రామస్థులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఎర్లగడ్డ సాయి కిరణ్ మొదటి బహుమతి, నిహారిక చల్ల రెండో బహుమతి, హేమంత్ మూడో బహుమతి సాధించారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. యువతలో ఆలోచనా శక్తి, ప్రతిభను వెలికితీసేలా నవరాత్రి ఉత్సవాల్లో చెస్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని క్రీడాకారులు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన యోగి గణేష్ అసోసియేషన్ సభ్యులు, నిర్వాహకులను కంగ్టి గ్రామస్థులు అభినందించారు.
యోగి గణేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా చెస్ టోర్నమెంట్

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి