భువనగిరి: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని BJYM భువనగిరి పట్టణం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పట్టణంలోని SSR కాలేజీ, బస్‌స్టాండ్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి BJYM పట్టణ అధ్యక్షుడు మామిడోజు పవన్ కుమార్ నేతృత్వం వహించారు. శిబిరంలో 76 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.
మామిడోజు పవన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా సేవలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే సామాజిక సేవా కార్యక్రమాలను కూడా BJYM కొనసాగిస్తుందని చెప్పారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, కౌన్సిలర్లు, BJYM నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి