ఆందోల్ నియోజకవర్గంలో సాయిపేట గ్రామంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఆదివారం నూతన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ యువజన అధ్యక్షుడు కొర్పోల్ విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కొర్పోల్ విష్ణు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. నూతన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి