Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బొమ్మల చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:47 PM

శంకేశ్వర్ బజార్ గణనాథుడి సన్నిధిలో రాంచందర్‌రావు

21-09-2026 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సైదాబాద్, సెప్టెంబర్ 21: శంకేశ్వర్ బజార్‌లో కొలువుదీరిన గణనాథుడిని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు సోమవారం దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపానికి చేరుకున్న ఆయనకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు.

అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళహారతి ఇచ్చారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు.

తమ ఆహ్వానాన్ని మన్నించి గణనాథుడిని దర్శించుకున్న రాంచందర్‌రావుకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కాలనీ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

శంకేశ్వర్ బజార్ గణనాథుడి సన్నిధిలో రాంచందర్‌రావు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News