Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:11 PM

దివీస్ దాతృత్వంపై విమర్శలా?

దివీస్ దాతృత్వంపై విమర్శలా?

దివీస్ దాతృత్వంపై విమర్శలా?
01-08-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కంపెనీ అభివృద్ధిని చూడలేని తనం సరికాదు: ఐఎన్టీయూసీ డివిజన్ అధ్యక్షుడు లగ్గొని వెంకటేష్ గౌడ్

గ్రామాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎస్‌ఆర్ (CSR) నిధులతో ఎన్నో సేవలు అందిస్తున్న దివీస్ లాబొరేటరీస్ కంపెనీపై కొందరు కావాలనే బురద చల్లుతున్నారని ఐఎన్టీయూసీ డివిజన్ అధ్యక్షుడు లగ్గొని వెంకటేష్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

​శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దివీస్ యాజమాన్యం తమ సామాజిక బాధ్యతలో భాగంగా గ్రామా గ్రామాన స్వచ్ఛమైన మంచినీటి ప్లాంట్లు, ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన వసతులు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులు పంపిణీ చేయడమే కాకుండా, రూ. 19.80 లక్షల వ్యయంతో 7,600 దుప్పట్లను ఉచితంగా అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకుందన్నారు. రైతాంగ సంక్షేమం కోసం కాలువలు తవ్వించి నీటి సదుపాయం మెరుగుపరుస్తున్నారని, ఇది రైతులకు ఎంతగానో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ​దివీస్ అందిస్తున్న సేవలతో పోల్చితే పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతర కంపెనీలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని వెంకటేష్ గౌడ్ విమర్శించారు. "దివీస్ ఎంతగానో సహాయం చేస్తున్నప్పటికీ విమర్శలు చేయడం తగదు. ఇదే ప్రాంతంలో ఉన్న శ్రీని (Srini) కంపెనీ ప్రజలకు, ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా ఏనాడైనా ఎవరైనా ప్రశ్నించారా?" అని ఆయన నిలదీశారు.

​స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంలో, అభివృద్ధిలో సహకరించని కంపెనీలపై స్థానిక నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. మంచి చేస్తున్న కంపెనీలకు మద్దతుగా నిలవాలని, అనవసర విమర్శలు మాని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

Sthanikam

దివీస్ దాతృత్వంపై విమర్శలా?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News