Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:02 PM

జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్‌పై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

31-07-2026 400 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశం.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, విద్యార్థుల వసతి గృహాలు, వంటశాల, భోజనశాల, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి విద్యార్థుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలని అధికారులకు సూచించారు. వసతి గృహాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

అనంతరం మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, గృహనిర్మాణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల్లో కొనసాగుతున్న పనుల పురోగతి, పెండింగ్ పనులపై ఆరా తీసి, వాటిని వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

తదుపరి రామన్నపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్, హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు, ఏఈలు ఆశిష్ రాఘవ, సందీప్, సురేష్, పంచాయతీ కార్యదర్శులు సైదిరెడ్డి, అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్‌పై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News