Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

అడ్డగూడూరులో మరో మైనర్‌పై అత్యాచారం.. నెల రోజుల్లో రెండో ఘటన కలకలం

31-07-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలి ఫిర్యాదు.. భరోసా కేంద్రానికి తరలింపు.. వరుస ఘటనలతో పోలీసుల పనితీరుపై ప్రశ్నలు.

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎలిజాల ఉమేష్ అనే వ్యక్తి మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, తనపై బలవంతంగా అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం చింతలగడ్డ సమీపంలో బాలికను వదిలివెళ్లినట్లు సమాచారం.

స్థానికులు, బంధువులు బాలికను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, అనంతరం ఆమెను వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ కోసం భరోసా కేంద్రానికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఈ నెల 28న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉండగా, ఇదే నెల 9న అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన కూడా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ కేసులో నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోలేదనే ఆరోపణల మధ్య, అనంతరం అదే నిందితుడు బాధితురాలిని కిడ్నాప్ చేసిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఒకే నెలలో ఇద్దరు మైనర్ బాలికలు లైంగిక దాడికి గురికావడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. వరుసగా వెలుగుచూస్తున్న ఘటనల నేపథ్యంలో మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

అడ్డగూడూరులో మరో మైనర్‌పై అత్యాచారం.. నెల రోజుల్లో రెండో ఘటన కలకలం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News