Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:05 PM

కరువుపై అప్రమత్తం.. 'జలసిరి' పనులు వేగవంతం చేయాలి. జడ్పీ సీఈఓ శోభారాణి

31-07-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రతి ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతి పొలంలో ఫామ్‌పాండ్ లక్ష్యంగా చర్యలు

రామన్నపేట, జూలై30,

ప్రస్తుత కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి గ్రామంలో 'జలసిరి' కార్యక్రమం కింద చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని జడ్పీ సీఈఓ శోభారాణి అధికారులను ఆదేశించారు. గురువారం రామన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూగర్భ జలమట్టాన్ని పెంచే లక్ష్యంతో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి రైతు పొలంలో ఫామ్‌పాండ్, ప్రతి గ్రామంలో ఊటకుంటల నిర్మాణాన్ని ప్రాధాన్యతతో చేపట్టాలని సూచించారు. నీటి కొరత దృష్ట్యా రైతులు అధిక నీరు అవసరమయ్యే సాంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా సర్పంచులు, అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.

ప్రభుత్వం చేపడుతున్న జలసంరక్షణ చర్యలను గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించవచ్చని ఆమె పేర్కొన్నారు.

సమావేశంలో మండల ప్రత్యేక అధికారి రాఘవరెడ్డి, తహసీల్దార్ లాల్ బహదూర్ ఎంపీడీఓ రాములు ఎంపీఓ రఫీ, ఏపీఓ వెంకన్న, ఏఐఏ ఏజాజ్ అలీ ఖాన్, ఏపీఎం జానీతో పాటు వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు, సీసీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

కరువుపై అప్రమత్తం.. 'జలసిరి' పనులు వేగవంతం చేయాలి. జడ్పీ సీఈఓ శోభారాణి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News