Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

ఆందోల్ మైసమ్మకు కుమ్మర్ల తొలిబోనం

ఆందోల్ మైసమ్మకు కుమ్మర్ల తొలిబోనం

ఆందోల్ మైసమ్మకు కుమ్మర్ల తొలిబోనం
31-07-2026 214 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అమ్మవారికి మట్టి పాత్రల్లోనే నైవేద్యం సమర్పించాలి

చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలోని శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో స్థానిక కుమ్మర్ల ఉత్సవ కమిటీ చైర్మన్ మల్కాజిగిరి అంజయ్య ఆధ్వర్యంలో ‘కుమ్మర్ల తొలిబోన’ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కుమ్మరి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కాజ్గిరి దయానంద్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ... మైసమ్మ అమ్మవారికి బంగారు, వెండి పాత్రల కంటే పవిత్రమైన మట్టి కుండల్లోనే నైవేద్యం సమర్పించడం ఆచారమని, దాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఆందోల్ మైసమ్మ దేవాలయంలో కుమ్మర్లకే పూజారులుగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో కుమ్మర్లు అందరూ ఏకమై ఇంత పెద్ద ఎత్తున తొలిబోన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ​ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాడూరు వెంకటేశం, జనరల్ సెక్రెటరీ దారిపల్లి ప్రవీణ్ కుమార్, కోశాధికారి తాడూరి ఆంజనేయులు, మండల అధ్యక్షుడు సిలువేరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పోలేపల్లి ముత్తయ్య, సిలువేరు లింగస్వామి, కౌన్సిలర్ పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య, సర్పంచులు తిగుళ్ల చంద్రయ్య, చిలువేరు లక్ష్మయ్య, ఉప సర్పంచ్ మల్కాజ్గిరి కృష్ణ, గ్రామ అధ్యక్షులు మల్కాజిగిరి నరసింహ, ఉపాధ్యక్షులు చిలువేరు చిన్న బుచ్చయ్య, గౌరవ అధ్యక్షులు మల్కాజిగిరి బాబు, కాశయ్య, గణేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆందోల్ మైసమ్మకు కుమ్మర్ల తొలిబోనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News