హైదరాబాద్ ఈఎస్‌సీఐ వేదికగా ముగిసిన 3వ బ్యాచ్ శిక్షణ
పట్టణాభివృద్ధి, పాలనా పరిపాలనా నైపుణ్యాల పెంపొందేందుకు సీడీఎంఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మున్సిపల్ ప్రజాప్రతినిధుల మూడో బ్యాచ్ శిక్షణా తరగతుల కార్యక్రమంలో చౌటుప్పల్ పురపాలక బృందం పాల్గొంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఈఎస్‌సీఐ ప్రధాన ఆడిటోరియంలో నిర్వహించిన ఈ శిక్షణా శిబిరానికి చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ నేతృత్వంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. పట్టణాల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం, అభివృద్ధి పనుల వేగవంతం, మున్సిపాలిటీల్లో ఆధునిక పరిపాలన పద్ధతులపై ఈ శిక్షణలో పలు అంశాలను నిపుణులు వివరించారు. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టణాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి