Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:12 PM

ఆస్పత్రి పనుల్లో ఆలస్యం వద్దు!

ఆస్పత్రి పనుల్లో ఆలస్యం వద్దు!

ఆస్పత్రి పనుల్లో ఆలస్యం వద్దు!
31-07-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

రోగులకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని ఆదేశం

చౌటుప్పల్‌లో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి, భవనాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆదేశించారు. చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలతో పాటు వివిధ విభాగాల రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బంది, చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న సేవలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన ఉచిత వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

​నూతన ఆసుపత్రి భవన నిర్మాణం చివరి దశకు చేరుకున్నందున, మిగిలి ఉన్న రోడ్ల నిర్మాణం, పరిసరాల శుభ్రత తదితర పనుల్లో ఆలస్యం తగదని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. ప్రజావసరాల దృష్ట్యా ఆసుపత్రిని త్వరితగతిన ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు మహమ్మద్ హన్ను, దేప రమ్య రాజు, ఉడుగు జ్యోతి రమేష్, స్థానిక నాయకులు, ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆస్పత్రి పనుల్లో ఆలస్యం వద్దు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News