Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 08:22 AM

ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. యువకుడి ఆత్మహత్య

17-07-2026 390 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఎలక్ట్రీషియన్ మృతి

చౌటుప్పల్ పట్టణ పరిధిలో ఓ యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ టౌన్ పరిధిలోని చిన్నకొండూర్ రోడ్డుకు చెందిన గంట యాదమ్మ, వెంకటయ్య దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. వీరి కుమారుడు గంట శ్రీకాంత్ (27) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం (ఈరోజు) ఉదయం 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి, శ్రీకాంత్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు అతను వేలాడుతూ నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.​ సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి గంట యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసును ఎస్ఐ కె. యాదగిరి దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. యువకుడి ఆత్మహత్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News