Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:38 AM

100 పడకల ఆసుపత్రి పనులను వెంటనే పూర్తి చేయాలి

17-07-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి

నత్తనడకన నిర్మాణ పనులు.. ప్రజలకు తప్పని ఇబ్బందులు

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి పనులను వెంటనే పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం చౌటుప్పల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి, అక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా బూరుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా శంకుస్థాపన చేసిన ఈ ఆసుపత్రి నిర్మాణం సంవత్సరాలు గడుస్తున్నా నత్తనడకన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. చౌటుప్పల్ ప్రాంతం ఆరు మండలాలకు కేంద్రంగా ఉండటంతో పాటు జాతీయ రహదారిపై ఉన్నందున ప్రతిరోజూ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అత్యవసర వైద్య సేవలు అందించడానికి 100 పడకల ఆసుపత్రి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ​ఆసుపత్రి నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రమాద బాధితులు, పేద ప్రజలు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు లేదా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందన్నారు. అక్కడ లక్షల రూపాయలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ​రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అవసరమైన వైద్య పరికరాలు, వైద్యులు, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

100 పడకల ఆసుపత్రి పనులను వెంటనే పూర్తి చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News