Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:05 PM

హెజిలో ఫార్మాలో విషాదం.. రియాక్టర్‌లో పడి షిఫ్ట్ ఇంచార్జ్ మృతి

16-07-2026 2,048 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మృతదేహం తరలింపుపై అనుమానాలు.. గోప్యత ఎందుకని ప్రశ్నలు.

యాదాద్రి భువనగిరి, జూలై 16:

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం సమీపంలోని హెజిలో ఫార్మా కంపెనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కంపెనీలో షిఫ్ట్ ఇంచార్జ్‌గా పనిచేస్తున్న కృష్ణారెడ్డి (42) విధి నిర్వహణలో ఉండగా రియాక్టర్‌లో పడి మృతి చెందినట్లు సమాచారం.

ఈ ఘటన అనంతరం కంపెనీ యాజమాన్యం విషయం బయటకు రాకుండా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతదేహాన్ని వెంటనే హైదరాబాద్‌కు తరలించి గోప్యంగా ఉంచినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకుండా యాజమాన్యం మౌనం పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం ఎలా జరిగింది? భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై కార్మిక వర్గాలు, స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

అధికారికంగా కంపెనీ యాజమాన్యం లేదా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉండగా, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

హెజిలో ఫార్మాలో విషాదం.. రియాక్టర్‌లో పడి షిఫ్ట్ ఇంచార్జ్ మృతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News