Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

రోడ్డు భద్రత–జీవితానికి రక్ష ​పంతంగి జెడ్పీహెచ్‌ఎస్‌లో అవగాహన సదస్సు

Updated : 16 Jul 2026 19:52 IST
As Preferred Source 1 min read
రోడ్డు భద్రత–జీవితానికి రక్ష ​పంతంగి జెడ్పీహెచ్‌ఎస్‌లో అవగాహన సదస్సు

రహదారి నిబంధనలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారానే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకటేష్ తెలిపారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు గురువారం చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.​​ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ వెంకటేష్ విద్యార్థులకు రోడ్డు భద్రతపై పలు కీలక సూచనలు చేశారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కుటుంబ సభ్యులకు వివరించాలని కోరారు.వయస్సు నిండకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు.పాదచారులు రోడ్డు దాటేటప్పుడు, నడిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.​విద్యార్థులంతా ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకుని, తమ ఇళ్లలో, చుట్టుపక్కల వారిని కూడా చైతన్యపరచాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, చౌటుప్పల్ ట్రాఫిక్ ఎస్సై , ఆర్ఎస్సై , పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత–జీవితానికి రక్ష ​పంతంగి జెడ్పీహెచ్‌ఎస్‌లో అవగాహన సదస్సు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news