Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

అంకిరెడ్డిగూడెం సర్పంచ్‌పై ఆరోపణలు అవాస్తవం

16-07-2026 375 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్పష్టం చేసిన డీఎల్పీఓ ప్రతాప్ నాయక్

​గ్రామపంచాయతీలో విచారణ.. సీసీ రోడ్డు పనుల పరిశీలన

చౌటుప్పల్ మండల పరిధిలోని అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్‌పై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని జిల్లా స్థానిక పంచాయతీ అధికారి (డీఎల్పీఓ) ప్రతాప్ నాయక్ స్పష్టం చేశారు. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు చేసిన ఫిర్యాదుపై గురువారం ఆయన విచారణ చేపట్టారు. అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విచారణ అనంతరం సర్పంచ్‌పై చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, అవి పూర్తిగా అవాస్తవమని డీఎల్పీఓ తేల్చిచెప్పారు.​​అనంతరం సీఎస్‌ఆర్ నిధుల ద్వారా దివీస్ సంస్థ సౌజన్యంతో రూ. 98 లక్షల వ్యయంతో గ్రామంలో చేపడుతున్న సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను డీఎల్పీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధికి అత్యంత కీలకమైన ఈ పనులకు ఎవరూ ఆటంకాలు కల్పించకుండా సహకరించాలని కోరారు. గ్రామంలో 20 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని, ప్రభుత్వ రోడ్డును ఆక్రమించి కట్టిన ప్రహరీలు, అరుగులు, ర్యాంపులను గుర్తించి కార్యదర్శి ద్వారా నోటీసులు జారీ చేస్తామన్నారు.కొలతల ప్రకారం ఆక్రమణలు ఉంటే తప్పనిసరిగా తొలగిస్తామని హెచ్చరించారు.​రోడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరం ఇరువైపులా మిగిలిన ఖాళీ ప్రదేశాల్లో గ్రామపంచాయతీ నిధులతో పూర్తి స్థాయి రోడ్లను అభివృద్ధి చేస్తామని సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ తెలిపారు. గ్రామాభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అభివృద్ధికి అడ్డంకులు సృష్టించకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.​ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంకిరెడ్డిగూడెం సర్పంచ్‌పై ఆరోపణలు అవాస్తవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News