Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:22 PM

చిట్యాలలో రెచ్చిపోయిన డీజిల్ దొంగలు – నిద్రలో ఉన్న డ్రైవర్ లారీ నుంచి 350 లీటర్ల డీజిల్ మాయం

13-07-2026 315 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, నల్లగొండ జిల్లా: జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లకు డీజిల్ దొంగల ముఠా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. డ్రైవర్ కాసేపు నిద్రలోకి జారుకుంటే చాలు.. ట్యాంక్ ఖాళీ చేసి పరారవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా చిట్యాల పట్టణ పరిధిలో జరిగిన డీజిల్ చోరీ ఘటన లారీ డ్రైవర్లలో భయాందోళనలకు గురిచేస్తోంది.

కోదాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ డ్రైవర్‌కు నిద్ర రావడంతో చిట్యాల సమీపంలోని దుర్గా హోటల్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రదేశంలో వాహనాన్ని నిలిపి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో అక్కడికి చేరుకున్న గుర్తుతెలియని దుండగులు లారీ డీజిల్ ట్యాంక్ మూతను ఐరన్ రాడ్లతో పగులగొట్టి సుమారు 350 లీటర్ల డీజిల్‌ను చాకచక్యంగా అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

డీజిల్ చోరీ సమయంలో లారీ పక్కనే ఏపీ30 ఎం 1377 నంబర్ గల కారు నిలిపి ఉంచి అందులో డీజిల్ తరలించినట్లు బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఘటన సమయంలో స్థానికులు ఆ కారును గమనించి ఫోటోలు కూడా తీసినట్లు సమాచారం. డ్రైవర్ మేల్కొనేలోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘటనపై బాధితుడు చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానిత వాహనం వివరాలు, స్థానికులు తీసిన ఫోటోలు, పరిసర ప్రాంతాల సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దొంగల ముఠాను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇటీవల జాతీయ రహదారిపై వరుసగా జరుగుతున్న డీజిల్ చోరీలు లారీ డ్రైవర్లను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో హైవే పార్కింగ్ ప్రాంతాల్లో భద్రతా చర్యలు పెంచాలని, సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసు గస్తీ బలోపేతం చేయాలని వాహనదారులు కోరుతున్నారు. డీజిల్ దొంగల ముఠాపై కఠిన చర్యలు తీసుకుని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాధితులు, లారీ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Sthanikam

చిట్యాలలో రెచ్చిపోయిన డీజిల్ దొంగలు – నిద్రలో ఉన్న డ్రైవర్ లారీ నుంచి 350 లీటర్ల డీజిల్ మాయం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News