Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

షాబాద్‌ మారణహోమం నిందితుడి కథ ముగిసింది

షాబాద్‌ మారణహోమం నిందితుడి కథ ముగిసింది

షాబాద్‌ మారణహోమం నిందితుడి కథ ముగిసింది
13-07-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పంజర్లలో మృతదేహం లభ్యం.. పక్కనే విషం బాటిల్.. ఆత్మహత్యగా అనుమానం.

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో మైనర్ బాలిక సహా ఆరుగురి హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్ మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామ శివారులో సోమవారం అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రాజ్‌కుమార్ మృతదేహం పక్కనే విషం బాటిల్ లభ్యమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, రాజ్‌కుమార్ తన మేనమామ గ్రామమైన పంజర్లకు వెళ్లి అక్కడే ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

కాగా, షాబాద్‌లో ఇటీవల మైనర్ బాలికతో పాటు ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన రాజ్‌కుమార్ మృతితో ఘటన మరో కీలక మలుపు తిరిగింది. అయితే అతని మరణానికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడికానున్నాయి.

Sthanikam

షాబాద్‌ మారణహోమం నిందితుడి కథ ముగిసింది

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News