Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:33 PM

అమరావతి ఈఎంఎస్ సంస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..

13-07-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ మండలం రెడ్లకుంట గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి ఈఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను ఆదివారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించారు.వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ఫ్యాక్టరీని ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం సంస్థలోని ఉత్పత్తి విభాగాలు,యంత్రాలను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ, కోదాడ నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి ఇలాంటి పరిశ్రమలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు.

అమరావతి ఈఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసిన వై. అనంతరావు, వై. కరాళ్ బోస్, డాక్టర్ స్టాలిన్లను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమ మరింత అభివృద్ధి చెంది స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు. నాణ్యమైన ఉత్పత్తులతో సంస్థ మంచి గుర్తింపు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడమే లక్ష్యంగా పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక యువతకు ప్రాధాన్యతనిస్తూ ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి. నరసింహారావు, స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కార్యదర్శి, కరస్పాండెంట్ కె. కృష్ణారావు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, స్థానిక నాయకులు, సంస్థ సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అమరావతి ఈఎంఎస్ సంస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News