Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

వ్యాయామం తో సంపూర్ణ ఆరోగ్యం

వ్యాయామం తో సంపూర్ణ ఆరోగ్యం

వ్యాయామం తో సంపూర్ణ ఆరోగ్యం
13-07-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

వ్యాయామం తో సంపూర్ణ ఆరోగ్యం

ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య సంరక్షణకు వ్యాయామం ఎంతో అవసరం-

యువత భవిష్యత్తు ను తీర్చి దిద్దేవిగా జిమ్ లు ఉండాలి-

కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి.

కోదాడ పట్టణంలో యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరుచుకోవాలని, క్రమశిక్షణ, ఏకాగ్రత, నిరంతర సాధనే విజయానికి పునాది అని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడలోని ఈషా ఇన్‌స్పైర్ భవనంలో ప్రారంభమైన ఓజీ ఫిట్‌నెస్ స్టూడియోను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య సంరక్షణకు వ్యాయామం ఎంతో అవసరమని, యువతతో పాటు మహిళలు, ఉద్యోగులు కూడా ప్రతిరోజూ కొంత సమయం శారీరక దృఢత్వానికి కేటాయించాలని సూచించారు. ఆరోగ్యకరమైన శరీరం, దృఢమైన మనసు ఉంటేనే సమాజాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. స్టూడియో నిర్వాహకులు కోదాడ ను ఫిట్‌ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. వ్యాయామం కేవలం శరీరాకృతికే కాకుండా ఆత్మవిశ్వాసం, మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణను పెంపొందిస్తుందని ఉన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, టిపీసీసీ డెలిగేట్ లక్ష్మీ నారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహబూబ్ జానీ, కౌన్సిలర్ లు,స్టూడియో నిర్వాహకులు ఆలేటి రాంబాబు ,కొత్తపల్లి సురేష్, హుస్సేన్ , నవీన్ ,మరియు ఫిట్‌నెస్ ట్రైనర్లు, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.

Sthanikam

వ్యాయామం తో సంపూర్ణ ఆరోగ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News