Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:54 PM

నకిరేకల్‌లో పద్మశాలి భవన నిర్మాణానికి శంకుస్థాపన

12-07-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ పట్టణంలో పద్మశాలి సంఘం కోసం రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన కమ్యూనిటీ భవనం, డైనింగ్ హాల్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పద్మశాలి సంఘ సభ్యుల సామాజిక, సాంస్కృతిక, సామూహిక కార్యక్రమాల నిర్వహణకు ఈ కమ్యూనిటీ భవనం ఉపయోగకరంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

నకిరేకల్ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తూ, ప్రతి వర్గానికి మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పద్మశాలి సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కమ్యూనిటీ భవనం నిర్మాణంతో పద్మశాలి సంఘానికి శాశ్వత వేదిక అందుబాటులోకి రానుందని సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

నకిరేకల్‌లో పద్మశాలి భవన నిర్మాణానికి శంకుస్థాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News