Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:33 AM

చౌటుప్పల్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా బడుగు మోహన్ బాబు

11-07-2026 252 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సంఘం అభివృద్ధికి, చేనేత పారిశ్రామికుల సంక్షేమానికి కృషి చేస్తా

నూతన పాలకమండలికి 'శ్రీ భావనా ఋషి కళానికేతన్' శుభాకాంక్షలు

శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం మాతృ సంస్థ ‘చౌటుప్పల చేనేత సహకార సంఘం’ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ‘శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి ప్యానల్’ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ‘శ్రీ భావనా ఋషి కళానికేతన్’ పక్షాన నూతన కార్యవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.​నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సంఘం అధ్యక్షులు బడుగు మోహన్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత సహకార సంఘం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో తన తండ్రి సంఘం అభివృద్ధికి, పారిశ్రామికుల సంక్షేమానికి చేసిన సేవలనే స్ఫూర్తిగా తీసుకుని, ఆయన బాటలోనే నడుస్తానని స్పష్టం చేశారు. చేనేత పారిశ్రామికులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాలు, స్కీములు సకాలంలో అందేలా చూస్తానని, చేనేత వృత్తుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని సభాముఖంగా ప్రకటించారు. నూతన కార్యవర్గం ​అధ్యక్షులు బడుగు మోహన్ బాబు,​ఉపాధ్యక్షులు గోశిక శ్రీకాంత్, ​ప్రధాన కార్యదర్శి కాటబత్తిని భీమయ్య, ​కోశాధికారి బడుగు సావిత్రి, ​గౌరవ సభ్యులు గోశిక నరసింహ, గోశిక లక్ష్మీపతి, దోర్నాల లక్ష్మీనారాయణ, పాపని రామకృష్ణ, బత్తుల మానస.ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, టీడీపీ మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ బడుగు లక్ష్మయ్య, చౌటుప్పల మాజీ ఎంపీపీ చిక్క నరసింహ, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు కందగట్ల బిక్షపతి, గోశిక చక్రపాణి, మాజీ ఎంపీటీసీ పెద్ద కృష్ణ, మార్కండేయ స్వామి దేవస్థానం ధర్మకర్త బడుగు శ్రీరాములు, దేవస్థానం అధ్యక్షులు బడుగు జయప్రకాష్, శ్రీ భావన ఋషి కళానికేతన్ అధ్యక్షులు బడుగు బాలరాజు, ప్రముఖ చేనేత కళాకారులు బత్తుల చంద్రయ్య, చేనేత పారిశ్రామికులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా బడుగు మోహన్ బాబు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News