Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

"యూరియా కొరత లేదు.. యాప్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోండి

Updated : 11 Jul 2026 18:07 IST
As Preferred Source 1 min read
"యూరియా కొరత లేదు.. యాప్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోండి

రైతులకు యూరియా ఎరువులు సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 96,150 యూరియా బస్తాలు అందుబాటులో ఉండగా, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యాప్‌లో నమోదు చేసుకున్న రైతులు తమకు సమీపంలోని ఎరువుల విక్రయ కేంద్రంలో యూరియాను బుక్ చేసుకుని 15 రోజులలోపు వెళ్లి పొందవచ్చని తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల్లో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని, అదనంగా మార్క్‌ఫెడ్ గోదాముల్లో 70,934 బస్తాలు సిద్ధంగా ఉండగా అవసరాన్ని బట్టి వెంటనే విక్రయ కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. యూరియా కొనుగోలు చేసే సమయంలో ప్రతి బస్తాకు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ఎరువులతో పాటు ఇతర వస్తువులు కొనాలని ఎవరైనా బలవంతం చేస్తే అంగీకరించవద్దని సూచించారు. నిర్ణీత ధర కంటే అధికంగా వసూలు చేసినా లేదా ఇతర సమస్యలు ఎదురైనా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

"యూరియా కొరత లేదు.. యాప్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోండి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news