Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:41 PM

నకిరేకల్‌కు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి రైల్వే ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన..

11-07-2026 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణకు శ్రీకారం.

రామన్నపేటలో భారీ బహిరంగ సభ.ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి కీలకంగా నిలిచే పలు మౌలిక వసతుల పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పర్యటనలో భాగంగా నార్కట్‌పల్లి మండలంలో ప్రతిష్ఠాత్మక రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం చిట్యాల–భువనగిరి ప్రధాన రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

ఆ తర్వాత రామన్నపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మంత్రి పాల్గొని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గంలో చేపట్టనున్న ప్రాజెక్టులపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు.

మంత్రి పర్యటన విజయవంతం కావడానికి చేపట్టిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమాల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పార్కింగ్, వేదిక నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

మంత్రి పర్యటనతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మరింత వేగం చేకూరనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

నకిరేకల్‌కు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి రైల్వే ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News