Sthanikam - Truth Matters
Logo

యాదాద్రి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా

Updated : 11 Jul 2026 14:57 IST
As Preferred Source 1 min read
యాదాద్రి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా

బంగారు వాకిలి సాక్షిగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, సభ్యులు

యాదగిరిగుట్ట, జూలై 11: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఆలయ ముఖ మండపంలోని బంగారు వాకిలి వద్ద ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఆలయ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నూతన చైర్మన్, సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

పాలకవర్గ చైర్మన్‌గా ఎం. సత్యనారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, సభ్యులుగా గడ్డం వినోద్, కొణిదెల సురేఖ, స్వాతి కంఠమణి, ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, లక్ష్మీనారాయణ నాయక్, విజయవరాజం, రాఘవేందర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే, పాలకవర్గ సభ్యులైన అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, తూళ్ల విజయేందర్ గౌడ్ కార్యక్రమానికి హాజరు కాలేదు.

కో-ఆప్షన్ సభ్యులుగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో భవానీ శంకర్, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, కో-ఆప్షన్ సభ్యులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

యాదాద్రి క్షేత్ర అభివృద్ధి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడం, ఆలయ ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో మరింత పెంచే దిశగా నూతన పాలకవర్గం కృషి చేయాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

యాదాద్రి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news