Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:28 PM

పూర్తిస్థాయి కమిషనర్‌ను వెంటనే నియమించాలి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల డిమాండ్.

10-07-2026 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP)కు పూర్తిస్థాయి డైరెక్టర్/కమిషనర్‌ను వెంటనే నియమించాలని మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రామన్నపేట శాఖ అధ్యక్షుడు టి. శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్యోగులు నిరసన చేపట్టారు. గత కమిషనర్ మే నెలలో పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఆ స్థానంలో పూర్తిస్థాయి అధికారి నియామకం జరగకపోవడంతో పలు పరిపాలనా సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా టి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మెడికల్ ఎడ్యుకేషన్ విభాగానికి బదిలీ అయిన ఆసుపత్రుల్లో పనిచేస్తున్న టీవీవీపీ ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ ఆలస్యం కావడం, సాధారణ బదిలీల సమస్యలు, పదోన్నతులు, సర్వీసుల క్రమబద్ధీకరణ, జీఓ-190 అమలు జాప్యం, కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపు ఉత్తర్వులు జారీ కాకపోవడం, పెండింగ్ బిల్లుల చెల్లింపులో ఆలస్యం వంటి అనేక సమస్యలు పేరుకుపోయాయని పేర్కొన్నారు.

ఈ సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులను నేరుగా సంప్రదించే అవకాశం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్‌గా మారనున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు అర్హత, అనుభవం కలిగిన అధికారిని పూర్తిస్థాయి డైరెక్టర్/కమిషనర్‌గా వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో పి. శ్రీనివాస్, శ్రీలత, రమేష్, గణేష్, వాసంతి, జ్యోతి, సంగీత, ప్రసన్న, సుశీల, శారద, మాలిక్, నాగవర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పూర్తిస్థాయి కమిషనర్‌ను వెంటనే నియమించాలి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల డిమాండ్.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News