Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:37 AM

నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు

06-07-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలు) చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్వాహకులు, వాటిని పర్యవేక్షించడంలో జిల్లా ఆహార భద్రతా అధికారులు పూర్తిగా విఫలమయ్యారనిAISU జిల్లా అధ్యక్షుడు కనుమ దామోదర్ RSF రాష్ట్ర సహాయ కార్యదర్శి సాకే హరి కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ, పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ప్రభుత్వ సంకల్పం క్షేత్రస్థాయిలో నీరుగారుతోందని విమర్శించారు. అనేక హాస్టళ్లలో పురుగులు పట్టిన బియ్యం, నాణ్యత లేని కూరగాయలతో వంటలు చేస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.హాస్టళ్లలో ఆహార నాణ్యతను తనిఖీ చేయాల్సిన జిల్లా ఆహార భద్రతా అధికారులు (Food Safety Officers) ఏనాడూ వసతి గృహాలను సందర్శించిన దాఖలాలు లేవు. అధికారుల ఈ ఘోర నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల ఆరోగ్యాలతో నిర్వాహకులు ఆటలాడుకుంటున్నారు," అని వారు మండిపడ్డారు.

ప్రధాన డిమాండ్లు:

జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో తక్షణమే ఉన్నతాధికారులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.

విధుల్లో నిర్లక్ష్యం వహించిన జిల్లా ఆహార భద్రతా అధికారులపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.

విద్యార్థులకు మెనూ ప్రకారం స్వచ్ఛమైన, పౌష్టిక ఆహారం అందేలా శాశ్వత నిఘా ఏర్పాటు చేయాలి కోరారు.

Sthanikam

నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News