Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:27 AM

డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం

13-05-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామకం

హైదరాబాద్‌: పార్టీ సభ్యత్వ నమోదును పూర్తిగా డిజిటల్‌ విధానంలో నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఎర్రవెల్లిలో పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు ఆరు గంటలపాటు సాగిన సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, భవిష్యత్‌ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించారు. డిజిటల్‌ నమోదు ప్రక్రియపై పార్టీ శ్రేణులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.

మూడ్రోజుల్లో సభ్యత్వ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర కమిటీ నుంచి ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

Sthanikam

డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం

Article Image

నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామకం

హైదరాబాద్‌: పార్టీ సభ్యత్వ నమోదును పూర్తిగా డిజిటల్‌ విధానంలో నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఎర్రవెల్లిలో పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు ఆరు గంటలపాటు సాగిన సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, భవిష్యత్‌ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించారు. డిజిటల్‌ నమోదు ప్రక్రియపై పార్టీ శ్రేణులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.

మూడ్రోజుల్లో సభ్యత్వ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర కమిటీ నుంచి ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News