Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
30-06-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

*​17వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ

*​వార్డు అభివృద్ధికి కృషి చేస్తాం: కౌన్సిలర్ ఉమామహేశ్వరి, కో-ఆప్షన్ మెంబర్ గంగరాములు

మహిళల సంక్షేమమే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చౌటుప్పల్ పురపాలక సంఘం 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి-సాయిలు, కో-ఆప్షన్ మెంబర్ పస్తం గంగరాములు అన్నారు. చౌటుప్పల్ పురపాలక సంఘం 17వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ చీరల' పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని-రమేష్ గౌడ్ సూచనల మేరకు వార్డులోని మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.​ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్, కో-ఆప్షన్ మెంబర్లు మాట్లాడుతూ... మహిళల ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కొనియాడారు. ముఖ్యంగా ఇందిరమ్మ క్యాంటీన్లు, ఇందిరమ్మ హౌసింగ్, మహిళా శక్తి, గృహ జ్యోతి పథకాలతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వారు గుర్తు చేశారు. ప్రతి మహిళా స్థిరమైన ఉపాధి అవకాశాలు పొందేలా ఎమ్మెల్యే, పురపాలక సంఘం చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి, వారి సహకారంతో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కోఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్, నల్లబెల్లి కిషన్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాదాని గోపాల్, ముత్యాల మహాలక్ష్మి, మహిళా సంఘం ఆర్‌పీ అంతటి అలివేలు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News