Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:26 PM

చేనేత సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల జూలై 10న పోలింగ్.. 2 నుంచి నామినేషన్లు.

29-06-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

రాష్ట్ర చేనేత సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో స్థానిక కాటన్ చేనేత సహకార సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల అధికారి కె. సురేష్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు జెల్ల వెంకటేష్‌కు ధ్రువీకరించిన ఓటరు జాబితాను అందజేశారు.

జూలై 2 నుంచి 4 వరకు నామినేషన్ల స్వీకరణ, 5న పరిశీలన, 6న నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా విడుదలతో పాటు ఎన్నికల గుర్తుల కేటాయింపు చేపట్టనున్నట్లు తెలిపారు. జూలై 10న పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. తుది ఫలితాల ప్రకటన అనంతరం మూడు రోజుల్లో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

సంఘంలో మొత్తం 9 డైరెక్టర్ స్థానాలు ఉండగా, వాటిలో 7 జనరల్, 2 మహిళలకు కేటాయించినట్లు తెలిపారు. నామినేషన్ ఫీజు రూ.750గా నిర్ణయించామని, అభ్యర్థులు ప్రతిపాదకులతో కలిసి స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పించాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్‌ను తహసీల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచామని, ఓటర్లు జాబితాను పరిశీలించుకోవచ్చని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు పెండెం వేణు, కార్యదర్శి దొంత నాగరాజు, వనం నరసింహ, పెండెం బాహన్ ఋషి, గంజి అశోక్, కైరం కొండ నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చేనేత సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల జూలై 10న పోలింగ్.. 2 నుంచి నామినేషన్లు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News