Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

మహిళల అభ్యున్నతికే ‘ఇందిరమ్మ మహిళా శక్తి’

29-06-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

​* చౌటుప్పల్‌లో ఘనంగా ‘ఇందిరమ్మ మహిళా శక్తి’ చీరల పంపిణీ

* మొదటి విడతగా 192 మంది మహిళలకు అందజేత

మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ఇందిరమ్మ మహిళా శక్తి’ పథకాన్ని ప్రవేశపెట్టిందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్‌, చైర్‌పర్సన్ ముఖ్య అతిథులుగా హాజరై పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. మహిళా సంఘాల బలోపేతానికి, వారి అభ్యున్నతికి పురపాలక సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 618 సంఘాలకు గాను, మొదటి విడతలో భాగంగా 20 మహిళా సంఘాలలోని సుమారు 192 మంది సభ్యులకు ఆమె చీరలను పంపిణీ చేశారు. అదేవిధంగా వివిధ వార్డుల కౌన్సిలర్లు తమ తమ వార్డుల మహిళా సంఘాల సభ్యులకు చీరలను అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనేదే ప్రభుత్వ ఆశయమని, ఒక మహిళా చైర్‌పర్సన్‌గా వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, షాదీఖానా చైర్మన్ కరీం, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, రిసోర్స్ పర్సన్స్ (ఆర్‌పీలు), మెప్మా సిబ్బంది, మున్సిపాలిటీ పరిధిలోని వివిధ మహిళా సంఘాల లీడర్లు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

మహిళల అభ్యున్నతికే ‘ఇందిరమ్మ మహిళా శక్తి’

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News