Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

కార్పొరేట్ కు ట్రాఫిక్ నిబంధనలు వర్తించవా..?

29-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సామాన్య ప్రజలపై వెంటనే చర్యలు తీసుకునే పోలీసులు, కార్పొరేట్ షాపింగ్ మాల్స్ వద్ద మాత్రం ఎందుకు మౌనం పాటిస్తున్నారనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

పట్టణంలోని విశాల్ మార్ట్ వద్ద వినియోగదారుల కోసం సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం వల్ల వాహనాలు రోడ్డుపైనే నిలిపివేయబడుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రమాదాలకు అవకాశం పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, షాపింగ్ మాల్ యాజమాన్యం రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలను పోలీసులు తీసుకెళ్లినా మాకు సంబంధం లేదు. అనే బోర్డు ఏర్పాటు చేసి తమ బాధ్యతను తప్పించుకునే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజలను ఆకర్షించి వ్యాపారం చేసే సంస్థ, వారి వాహనాల పార్కింగ్‌కు కనీస సౌకర్యం కల్పించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరోవైపు పట్టణంలో చిన్న షాపుల వద్ద ఒక్కటి లేదా రెండు వాహనాలు నిలిపినా వెంటనే చలానాలు విధించే ట్రాఫిక్ పోలీసులు, విశాల్ మార్ట్ ముందు రోడ్డంతా వాహనాలతో నిండిపోయినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీంతో "చట్టం అందరికీ సమానమా..? లేక కార్పొరేట్ సంస్థలకు వేర్వేరు నిబంధనలా..?" అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా రోడ్లపై పార్కింగ్ జరుగుతున్నా సంబంధిత అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు...

* షాపింగ్ మాల్‌కు అనుమతులు ఇచ్చే సమయంలో పార్కింగ్ నిబంధనలు పరిశీలించారా..?

* వినియోగదారులకు పార్కింగ్ లేకుండా వ్యాపారం నిర్వహించేందుకు ఎలా అనుమతించారు..?

* చిన్న వ్యాపారులపై ఒకలా, కార్పొరేట్ సంస్థలపై మరోలా చట్టం అమలవుతోందా..?

* ట్రాఫిక్ సమస్యకు బాధ్యులు ఎవరు..?

అధికారులు స్పందించాల్సిందే....

రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి, పార్కింగ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మాల్ మేనేజర్ ని సంప్రదించగా రోడ్డుపై వాహనాలు నిలిపితే మాల్ కు సంబంధం లేదని, తెలిపారు.

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు...

ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి...

పట్టణంలో షాపింగ్ మాల్స్ ముందు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేనట్లయితే కఠిన చర్యలు తీసుకొని ఉన్నట్లు తెలిపారు.

వాహనదారులకు అంతరాయం కలగకుండా మాల్స్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు.

Sthanikam

కార్పొరేట్ కు ట్రాఫిక్ నిబంధనలు వర్తించవా..?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News